12-12-2025 06:53:29 PM
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పదవులను అధిక స్థానాలను కైవసం చేసుకోవడంలో నాయకులు , కార్యకర్తలు కృషి మరువలేనిదని తాండూర్ మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్ లకు ఆయన పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడిన కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ధైర్యంగా నిలిచి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించారని అభినందించారు.