calender_icon.png 12 December, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకర్లపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్రమాలపై విచారణ జరపాలి

12-12-2025 07:56:38 PM

మంథని,(విజయక్రాంతి) మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామ సర్పంచ్  ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్రమాలపై విచారణ జరపాలని సర్పంచ్ అభ్యర్థి మెండే రాజయ్య శుక్రవారం మంత్రి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు అక్రమలపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలన్నారు. గురువారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ అధికారులు పారదర్శకంగా నిర్వహించలేదని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏక పక్షంగా నిర్వహించినట్లు తెలిపారు.

ఓట్ల లెక్కింపు క్రమంలో తనకు ప్రత్యర్థి కన్నా ఆధానంగా ఒక్క ఓటు (1) రావడం జరిగిందని, గెలుపు తనకు అని చెప్పి వెంటనే బయటికి వెళ్లి ఫోన్ లో మాట్లాడి ఈ యొక్క ఓటు చెల్లదని చెప్పడం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. డ్రా కు ఆర్ఓ కారణమాయ్యడని,  అభ్యర్థులకు సమయం ఇవ్వకుండా రాత్రి అవుతుందని చెప్పిన అధికారులు మేము వెళ్ళాలని చెప్పి అఘామేఘాల మీద అభ్యర్థులను ఒత్తిడి గురి చేసి అయోమయానికి గురి చేసి డ్రా కొరకు దరఖాస్తు రాయించుకొని సంతకాలు తీసుకోవడం జరిగిందని, డ్రా చిట్టీలు మడతలు మడతలుగా తయారు చేయడం వలన రెండు చిట్టి లు అత్తుకొని ఉండి తీస్తుండగా రావడం తో చిట్టీల మీద అనుమానాలు ఉన్నాయి.

తర్వాత చిట్టీలను రౌండ్ రోల్ చేయకుండా ఒక్క దాని పై ఒక్కటి పెర్చడం వలన ఏ చిట్టీ తీసిన ఒక్క అభ్యర్థి నెంబర్ ఉండడం వలన ప్రత్యర్థి అభ్యర్థికి చిట్టీ వెళ్లడంతో తనకు అన్యాయం జరిగినట్లు తెలిపారు. ఈ చిట్టీలను కూడా డబ్బాలో ట్రేలో పెట్టి నామ మాత్రంగా తిప్పి డ్రా తీశారని,  రిటర్నింగ్ అధికారి ఏక పక్షంగా తమకు సమయం ఇవ్వకుండా ఒక్క ఓటు (1)తో గెలిచామని చెప్పి, తీరా సమయానికి డ్రాకు కారణమాయ్యడని, కావున కాకర్లపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమగ్రమైన విచారణ జరిపి ఆ ఒక్క (1) ఓటును పరిగణలోనికి తీసుకోని తన గెలుపుకు సహకరించి, ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని,  తాను పెట్టుకున్న కౌంటింగ్ ఏజెంట్ ను లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నట్లు సర్పంచ్ అభ్యర్థి మెండే రాజయ్య  మంథని ఆర్డీఓ సురేష్ కు పిర్యాదు చేసినట్లు తెలిపారు.