calender_icon.png 12 December, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయండి

12-12-2025 07:01:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పాలన అందించాలని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు ఉపసర్పంచులు శుక్రవారం ఇంద్రకరణ్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.