12-12-2025 06:50:26 PM
సుల్తానాబాద్ జడ్జి దుర్గం గణేశ్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సుల్తానాబాద్ జూనియర్ సివిల్ జడ్జి దుర్గం గణేశ్ అన్నారు. శుక్రవారం విశ్వజనీన ఆరోగ్య పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జడ్జి గణేష్ పేషంట్లకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి పేషంట్లను అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా జడ్జి గణేష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం అయోష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను గురించి పేషంట్లకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తారని, గర్భిణి స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. పుట్టిన బిడ్డకు ఎప్పటికప్పుడు వాక్సినేషన్ చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, ఎజిపి దూడం ఆంజనేయులు, లోక్ అదాలత్ సభ్యులు మాడూరి ఆంజనేయులు, న్యాయవాది సామల రాజేంద్ర ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.