12-12-2025 07:37:05 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ గా నామినేషన్ వేసిన అభ్యర్థులకు అవగాహన కార్యక్రమాన్ని మసివాగు గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ చంద్రభాను మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు చాలా కీలకమని, వ్యక్తిగత దూషణలకు వెళ్లకుండా అందరూ సమన్వయం పాటించాలన్నారు. గ్రామాల్లో ఏదైనా ఘర్షణ వాతావరణం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు గౌరవించి పోలీసులకు సహకరిస్తే ఎన్నికలు మరింత ప్రశాంతంగా సాగుతాయని అన్నారు.
ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయవద్దని విజ్ఞప్తి చేశారు. నియమ నిబంధనలు పాటించకపోతే కేసులు సైతం నమోదు అవుతాయని హెచ్చరించారు. అభ్యర్థులందరూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలకు జరుపుకోవాలని, ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు సూచనలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా సెక్షన్ 163 బీఎన్ ఎస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు, ఫలితాల అనంతరం ఎలాంటి ర్యాలీలు గాని సమావేశాలకు గాని అనుమతి లేదని, ఇది గమనించి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ తాటిపాముల సురేష్, ఎస్సై సమ్మిరెడ్డితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.