12-12-2025 07:58:41 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహ సహాయ వార్డెన్ గా కంప్యూటర్ సైన్స్ పార్ట్ టైం అధ్యాపకులు జి జయంతిని నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య జాస్తి రవి కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చీఫ్ వార్డెన్ ఆఫీస్ లొ డాక్టర్ నజీముద్దీన్ మున్వర్ కి శుక్రవారం జయంతి జాయినింగ్ రిపోర్ట్ అందజేసి విధులు స్వీకరించారు.
ఈ సందర్భంగా చీఫ్ వార్డెన్ మాట్లాడుతూ హాస్టల్ అధికారులంతా సమన్వయంతో ముందుకు సాగాలని, వసతి గృహాల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించే దశగా చూడాలని, ఇబ్బందులు ఎదురైతే తనకు తెలియజేయాలని, పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్స్ డాక్టర్ కృష్ణ కుమార్, డాక్టర్ ఎస్ కిరణ్, సావిత్రి, వసతిగృహ సంరక్షకురాలు సంధ్య పాల్గొన్నారు.