calender_icon.png 12 December, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి

12-12-2025 08:05:00 PM

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న  సీఐ  గోవిందరెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర డిజిపి ఉత్తర్వుల మేరకు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు మేడిపల్లి పోలీసులు జామా మసీద్, నారాపల్లిలో సుమారు 200 మంది ముస్లిం వాసులతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, నారాపల్లి మెయిన్ రోడ్డు పైన రాలి నిర్వహించారు. ఆరువారాల కార్యక్రమంలో భాగంగా స్కాంసే బచో అనే థీమ్ తో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆన్లైన్ మోసాలు, సైబర్ భద్రత, మోసాలు జరిగిన వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

పోలీస్ సైబర్ క్రైమ్ లేదా కోర్టు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్, ను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. అలాగే ఎటువంటి చెల్లింపులు ఓటి పీలు, బ్యాంకు వివరాలు అడిగిన షేర్ చేయవద్దని, ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సదస్సులో ప్రజలకు మేడిపల్లి పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ గోవిందరెడ్డి, ఎస్ఐ లు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.