calender_icon.png 8 October, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం వైఫల్యాలను బాకీ కార్డు ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం

08-10-2025 08:50:36 PM

స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలిచేది బీఆర్ఎస్

ఒంటెద్దు నరసింహారెడ్డి 

గరిడేపల్లి (విజయక్రాంతి): ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ప్రజలను నమ్మించి మోసం చేసిందని వారు ఇచ్చిన హామీలను బాకీ కార్డు ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఫల్యాలను ఎండగడతామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. బుధవారం గరిడేపల్లి మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుగులోత్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

స్తోమతకు మించి హామీలను అధికారంలోకి వచ్చాక రైతులను నిరుద్యోగులను మహిళలను ఆటో కార్మికులను వృద్ధులను వికలాంగులను అందరినీ నమ్మించి మోసం చేసిందని దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నమ్మకం పోయిందన్నారు. జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రజలకు బాకీ హామీలను కార్డు ద్వారా ప్రజలకు అందజేసి వివరించాలని ఆయన కోరారు. దీని ద్వారా స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కార్యక్రమంలో హుజూర్నగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేఎల్ఎన్ రెడ్డి మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.