calender_icon.png 8 October, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక

08-10-2025 08:48:18 PM

రేగొండ (విజయక్రాంతి): మండలంలోని భాగిర్తిపేట గ్రామ గౌడ సంఘం నూతన కమిటీ బుధవారం ఎన్నికైంది. గ్రామంలోని ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో గౌడ కులస్తులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా మెరుగు బాపన్న, ఉపాధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, కార్యదర్శి బొనగాని తిరుపతి, కార్యవర్గ సభ్యులు  శ్రీపతి భిక్షపతి (చిన్న), మాటూరి తిరుపతి, బుర్ర రవి, శ్రీపతి రాజు, శ్రీపతి సదయ్య, శ్రీపతి మొగిలిలు ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ గౌడ కులస్తుల ఐక్యత, అభివృద్ధి, సామాజిక సేవ దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గౌడ కులస్తులు, సంఘ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.