01-09-2025 07:16:00 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన బీఅర్ఎస్వి సీనియర్ నాయకుడు ఆసిఫాబాద్ జిల్లా బీఅర్ఎస్వి ఇంచార్జీ(BRSV Incharge) ఎండి ముస్తఫా జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పెద్దపెల్లి మాజీ ఎంపీ, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడు ముస్తఫా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ దాని అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.