calender_icon.png 4 September, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియాలో 36% బొగ్గు ఉత్పత్తి

01-09-2025 07:16:20 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలో ఆగస్టు మాసానికి గాను నిర్దేశించిన లక్ష్యంలో 36% బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా సింగరేణి ఇంచార్జి జనరల్ మేనేజర్ విజయ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఏరియాలోని జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో కురిసిన వర్షాల మూలంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని, దీనికి తోడు భూగర్భ గనుల్లో కార్మికుల గైర్హాజర్ మూలంగా ఆశించిన బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని, దీనిపై యూనియన్ నాయకులతో చర్చించి గైర్హాజర్ తగ్గించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు, అధికారులు, యూనియన్ నాయకుల సహాయ సహకారాలతో భూగర్భ గనులలో 100% బొగ్గు ఉత్పతి సాధించడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు.

రానున్న రోజుల్లో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి మెరుగుపరిచి లక్షాలను సాధించేలా తగిన ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు కార్మికులు అధికారులు కార్మిక సంఘాల నాయకులు సహకరించి బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ పర్సనల్ మేనేజర్ ఎండి ఆసిఫ్, ఐఈడి, ఎస్ఈ కిరణ్ కుమార్, సీనియర్ పిఓ శంకర్ పాల్గొన్నారు.