25-07-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): బనకచర్లతో తెలంగాణకు జరిగే నష్టాన్ని విద్యార్థి నేతలకు, కా ర్యకర్తలకు వివరించేందుకు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీ నివాస్ యాదవ్ తెలిపారు. గురువా రం హైదరాబాద్‌లోని తెలంగాణ భ వన్‌లో నిర్వహించిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26న హైదరాబాద్‌లోని ఉ ప్పల్‌లో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
బనకచర్లపై ఐదు ల క్షల కరపత్రాలను విద్యార్థులు పంచి, చంద్రబాబు, మోదీ, రేవంత్‌రెడ్డి కలి సి తెలంగాణ నీటి వనరులను కొల్లగొడుతున్న తీరును వివరిస్తామ న్నా రు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారని శ్రీ నివాస్ యాదవ్ తెలిపారు.