calender_icon.png 14 August, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం సూర్య ఘర్ స్కీమ్ పై కలెక్టర్ సమీక్ష

13-08-2025 10:35:59 PM

అవగాహన సదస్సులు, కార్యక్రమాలపై ఆరా..

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీం పై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అమలులో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలో రెడ్కో అలాగే వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సమీక్ష సమావేశం నిర్వహించగా.. మరోసారి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 5000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో ఈ పథకంపై వివిధ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

పథకంలో భాగంగా ఆయా గ్రామాల్లో సౌర విద్యుత్ వినియోగించేలా డి ఆర్ డి ఓ, డి పి ఓ ఇతర శాఖల ఆధ్వర్యంలో సదస్సులు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఈ పథకంలో భాగంగా అందించే సబ్సిడీపై వివరించారని కలెక్టర్ పేర్కొన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం ఎక్కువగా చేసే గ్రామాన్ని త్వరలో ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. సమీక్ష సమావేశంలో జెడ్పీ సీఈవో వినోద్ కుమార్ జిల్లా పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్ పంచాయతీరాజ్ శాఖ ఈ సుదర్శన్ రెడ్డి అడిషనల్ డి ఆర్ డి ఓ శ్రీనివాస్ లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్ కో డిఎం మునీందర్ రెడ్డి పిడిఓ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.