13-08-2025 10:49:20 PM
గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు
సీసి కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజలు స్వచ్చద్దంగా ముందుకు రావాలని విజ్ఞప్తి
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం (విజయక్రాంతి): నేరాల నియంత్రణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీస్ యంత్రాంగం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజబుల్ పోలీసింగ్ పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు, దొంగతనాలు నియంత్రణలో వుంటాయన్న నేపథ్యంలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం రోజులుగా పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. పోలీస్ గస్తీ పెంచి, పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 50 హోటళ్ళు, లాడ్జీలపై పోలీసులు సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించి, అనంతరం వారికి వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కట్టడిలో పురోగతి సాధించడం జరిగిందని తెలిపారు.