13-08-2025 11:16:19 PM
నాగారం: నాగారం మండల(Nagaram Mandal) పరిధిలోని పసునూరు మోడల్ స్కూల్ లో నషా ముక్త భారత్ అభియాన్ లో భాగంగా విద్యార్థులకు బుధవారం నాడు డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగారం మండల సబ్ ఇన్స్పెక్టర్ అవిలయ్య(Sub Inspector Avilaiah) మాట్లాడుతూ, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు, డ్రగ్స్ కి అలవాటు పడినవారు అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. మీ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్ కి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 14446 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బల్గూరి చంద్రబాబు మాట్లాడుతూ... యువత డ్రగ్స్ మరియు చెడువసనాలకు గురవుతున్నారు. విద్యార్థులు డ్రగ్స్ కు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. డ్రగ్స్ కు బానిస అయిన వారు చదువులో వెనకంజ ఉంటూ మానసిక రుగ్మతలకు గురవుతారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.