calender_icon.png 14 August, 2025 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

13-08-2025 11:06:53 PM

అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి..

ఎల్లారెడ్డి ఆర్డీవో, పార్థ సింహారెడ్డి..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి ఆర్టీవో కార్యాలయంలో ఎల్లారెడ్డి ఆర్టీవో పార్థ సింహరెడ్డి(RTO Partha Simha Reddy), ఎల్లారెడ్డి డివిజన్ లోని సంబంధిత శాఖ, అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని, ముందస్తుగా ఎల్లారెడ్డి డివిజన్ లోని పలు సంబంధిత శాఖ అధికారులతో నాలుగు రోజులు అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలు అవసరం మేరకే బయటకు రావాలని అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడద్దని ఆర్డిఓ సంబంధిత శాఖ అధికారులతో  ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

రానున్న నాలుగు రోజులు ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అధికారులు విధుల్లో సెలవులు పెట్టకుండా విధులు నిర్వహించాలని నిర్లక్ష్యం వహించకుండా నాలుగు రోజులు భారీ వర్షాల, కురిసే అవకాశం ఉందని వాటి నుంచి ప్రజలను కాపాడే బాధ్యత అధికారులుగా మనపై ఉందని విధులు నిర్వహించాలని ఆర్డీవో అధికారులకు ఆదేశించారు. పోలీస్ శాఖ వారిని 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ ఆపదలో వచ్చే కాల్స్ ను తప్పకుండా రిసీవ్ చేసుకోవాలని అగ్ని మాపక శాఖ వారిని విపత్కర పరిస్థితుల్లో కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకో వలసినదిగా ఆర్డీవో ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులను పౌరులకు విద్యుత్తు అవాంతరాలు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ ను అప్రమత్తమంగా ఉండవలసిందిగా ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఆర్డీవో ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.

కంట్రోల్ రూమ్ యొక్క నెంబర్ 9492022475. డివిజన్ స్థాయిలోఎలాంటి  అవాంఛనీయ సంఘటన జరిగిన పౌరులు పై నెంబర్ ని సంప్రదించగలరు.అదేవిధంగా జిల్లాస్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 08468220069 ఈ నెంబర్ కి కాల్ చేసి విపత్తు పరిస్థితిని నివేదించగలరు. అనంతరం ఎల్లారెడ్డి తాసిల్దార్ కార్యాలయంలో ఎల్లారెడ్డి తాసిల్దార్ ప్రేమ్ కుమార్ మండలంలోని పలు సంబంధిత శాఖ అధికారులతో రానున్న నాలుగు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు గురవనున్న నేపథ్యంలో ప్రజలకు కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని ప్రతి అధికారి సెలవులు పెట్టకుండా నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండి వర్షాల నుండి ప్రజలను కాపాడాలని తాసిల్దార్ ప్రేమ్ కుమార్ తెలిపారు.