calender_icon.png 14 August, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నషా ముక్త్ భారత్ కార్యక్రమం..

13-08-2025 11:09:56 PM

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ జెడ్పిజిఎస్ బాలుర పాఠశాలలో “నషా ముక్త్ భారత్” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తూప్రాన్ ఎస్ఐ శివానందం హాజరయ్యారు. ఇందులో భాగంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తుపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని గృహాలలో తల్లిదండ్రుల మాట వినాలని పాఠశాలలో అధ్యాపకులు చెప్పే బోధన సక్రమంగా వినాలని తెలిపారు. గ్రామ, పాఠశాల స్థాయిలో మత్తు నివారణకు అందరూ సహకరించాలని వివరించారు. ఇందులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.