calender_icon.png 14 August, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి పౌరుడి బాధ్యత

13-08-2025 10:54:39 PM

ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు..

మిడ్జిల్: మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై యువత విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు(SI Shiva Nageshwar Naidu) అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సామాజిక న్యాయం సాధికారత శాఖ వారి ఆదేశానుసారం నాశముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులు యువత డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలను వారికి అవగాహన కలిగించాలన్నారు, సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్ ను అరికట్టేందుకు పోలీసులకు సహకారం అందించాలన్నారు, విద్యార్థులు యువత మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం రవాణాపై ఎటువంటి సమాచారం తెలిసిన డయల్ 100 నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ తిరుపతయ్య, అధ్యాపకులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.