13-08-2025 10:38:54 PM
రాళ్లపేట చెరువులో 16 కేజీల చేపలు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో కురిసిన భారీ వర్షానికి చెరువుల్లో ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదలతో భారీ చేపలు కొట్టుకొస్తున్నాయి. మండలంలోని రాళ్లపేట చెరువులో 16 కిలోల చేపను కనువిందు చేసింది. మంగళవారం రాత్రి నుంచి విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో రాళ్లపేట చెరువులో వరద నీటితో కొట్టుకు వస్తున్న పెద్ద పెద్ద చేపలు కంటపడ్డాయి. దీంతో గ్రామస్తులు ఆ చెరువుకు క్యూ కట్టారు. భారీ చేపలు లభించడంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులంతా చేపల కూరతో ఆరగించారు.