13-08-2025 10:57:28 PM
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు..
దౌల్తాబాద్ (విజయక్రాంతి): సూరంపల్లి నుంచి నాచారం వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయమై ధ్వంసం అయ్యిందని ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు(MP Madhavaneni Raghunandan Rao) అన్నారు. బుధవారం ప్రజా సమస్యలపై బిజెపి భరోసా కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. రాయపోల్ మండల అధ్యక్షులు మంకిడి స్వామి మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును కలిసి రెండు మండలాల ప్రధాన రోడ్డు సమస్య సూరంపల్లి నుంచి నాచారం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యిందని ఈ సమస్యను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్ళారు.
వెంటనే ఎంపీ స్పందించి ఈ రోడ్డు మరమ్మతుల గురించి రోడ్డు భవనాల శాఖ డిఈ తో ఫోన్ లో మాట్లాడగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని దానిలో భాగంగానే సూరంపల్లి నుంచి నాచారం వరకి 28 కి.మీ కు రోడ్డు మరమ్మతు పనులకు నిధులు మంజూరయ్యాయని ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుందని త్వరలోనే టెండర్ పూర్తి చేసి పనులు మొదలు పెట్టడం జరుగుతుందని ఎంపీకి తెలిపారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ, అతి త్వరలో రోడ్డు మరమ్మతు పనులను ప్రారంభించాలని ఆ రోడ్డు వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతు పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహా రెడ్డి, అనిల్ రెడ్డి, రామాంజనేయులు, తిరుపతిరెడ్డి, రవి యాదవ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.