26-12-2025 07:26:43 PM
సికింద్రాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్‌లో అనుమానాల దారుణ ఫలితం..! పిల్లల ముందే భార్యను పెట్రోల్‌తో కాల్చి చంపి, కూతురిని మంటల్లో తోసిన భర్త! నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతి మధ్య అనుమానాలు దారుణాంతానికి దారితీశాయి. నల్గొండ జిల్లా నివాసులైన త్రివేణి, వెంకటేష్ దంపతి ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
అనుమానాలతో వేధలు,పుట్టింటికి వెళ్లిన భార్య,వెంకటేష్ భార్యపై అనుమానాలు పెంచుకుని వేధిస్తూ, త్రివేణి పుట్టింటికి వెళ్లిపోవడానికి కారణమైంది.ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే దారుణ హత్యకు దిగాడు.
పిల్లల ముందే పెట్రోల్‌తో దహనం
పిల్లల ముందే పెట్రోల్ పోసి త్రివేణిని నిప్పటించిన వెంకటేష్, అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేశాడు. వారి అరుపులు, కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
త్రివేణి మరణం,కూతురు స్వల్ప గాయాలు
ఆసుపత్రికి చేరుకున్నప్పుడు త్రివేణి ఇప్పటికే మరణించింది.కూతురు స్వల్ప గాయాలతో తప్పించుకుంది.
నిందితుడు అరెస్ట్,పోలీసులు దర్యాప్తు
నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి వెంకటేష్‌ను 12 గంటల్లోనే అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.ఈ ఘటన డొమెస్టిక్ వైలెన్స్ ప్రమాదాలను మళ్లీ చర్చనీయం చేస్తోంది..