calender_icon.png 26 December, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

హోటల్‌ అశోక వసంతోత్సవాలు

26-12-2025 07:29:52 PM

- ఆతిథ్య రంగంలో 40 ఏళ్ల విశిష్ట సేవల సంబరాలు 

- ఈనెల 31 వరకు 10 శాతం డిస్కౌంట్‌

హనుమకొండ,(విజయక్రాంతి): ట్రైసిటీ నడిబొడ్డున ఉన్న హోటల్‌ అశోకా ఇప్పుడు 40 ఏళ్ల వసంతోత్సవాలు జరుపుకుంటోంది. ఓరుగల్లు సంస్కృతి సంప్రదాయాలతో అతిథి సేవలో హోటల్‌ అశోకా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. దేశాధినేతలు, ప్రధానులు, పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉన్నతాధికారులు, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన అనేక మంది ఈ హోటల్‌లో ఆతిథ్యం పొందినట్లు అశోకా యాజమాన్యం పేర్కొంది. పరిశుభ్రతే పరమావదిగా, రుచి శుచికరమైన భోజనం, విలాసవంతమైన గదులకు చిరునామా హోటల్ అశోకా అని ఓరుగల్లు ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు, ఆలయాలు దర్శించుకోవాలంటే హనుమకొండకు రావాల్సిందేనని హోటల్ అశోకా ఆతిథ్యం పొందాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 16 నుండి 31 వ తేదీ వరకు రూమ్ బుకింగ్, ఫుడ్, లిక్కర్లపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.