calender_icon.png 16 October, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధ్వానంగా బీటీ రహదారులు..

16-10-2025 12:00:00 AM

పట్టించుకోని ప్రజా ప్రతినిధులు,అధికారులు..

మాగనూరు అక్టోబర్ 15.. మాగ నూర్ మండలంలో వివిధ గ్రామాలకు వెళ్లి బీటీ రోడ్డు రహ దారులు కురుస్తున్న వర్షానికి రహదారులు పూర్తి గా అద్వాన స్థితి గా మారాయని ఎప్పుడు ఏ ప్రమాదము జరుగుతుందోనని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారిన గ్రామాల ర హదారులు మారడం లేదని ఆయా గ్రామ ప్రజ లు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్నది.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, రహదా రుల మరమ్మతు కోసం నిధులు మంజూరయ్యాయని తొందరలోనే టెండర్లు వేసి పనులు ప్రారంభించడం జరుగుతుంది అని చెప్పుకుంటున్నారే తప్ప నేటి వరకు మరమ్మతులు చేయుటలో పాలకుల నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. రహ దారులు పూర్తిగా గుంతలు గుంతలుగా ఏర్పడి వాహనదారులు ఈ రహదారుల వెంబడి వెళ్లాలంటే జంకుతున్నామని తెలిపారు.

రాత్రి వేళల్లో రోడ్లపై ఏర్పడిన గుంతలలో ప్రయాణించి క్రిందపడి గాయాలైన సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. రహదారులు అధ్వానంగా ఉండడంవల్ల గ్రామాల్లో గర్భిణీ స్త్రీలను, మరియు ఇతర ఏదేని సీరియస్ కేసులు ఉంటే ఈ యొక్క రహదారిపై తీసుకు వెళ్లే లోపు మరణించే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు.అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాలకు వెళ్లే రహదారులను మరమ్మతులు చేసి మట్టి రహదారులకు బీటీ రోడ్లుగా మార్చి ప్రయాణికులకు ప్రమాదాలు జరగకుండాచూడాలన్నారు.