16-10-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
భూత్పూర్, అక్టోబర్ 15: మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. భోజనం చేస్తున్న చిన్నారులతో మాట్లాడి ఎలా ఉందని అడిగి తెలసుకున్నారు.
పాఠశాలలో ఉండే ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఫుడ్ కమిటీ భోజనం చేయాలని, దానిని ఎందుకు పాటించడం లేదని ఉపాధ్యాయులను ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్లో మొత్తం ఎంతమంది టీచర్లు ఉంటారు? స్కూల్లో మొత్తం 24 మంది టీచర్లు ఉన్నారని తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నా భోజనం చెక్ చేయాలని సూచించారు. స్కూల్ ఆవరణ మొత్తం శుభ్రంగా ఉంచుకోవాలి కదా ఎక్కడపడితే అక్కడ వాహనాలు అలా పార్కింగ్ చేయడం పట్ల ఆగ్రహంవ్యక్తంచేశారు.