18 April, 2026 | 5:19 PM

ఆదివాసీలపై బుల్డోజర్ రాజ్యం

24-06-2025 01:47 AM

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జూన్ 23(విజయక్రాంతి): హైదరాబాద్ మీదకే కాదు అడవి మీదకు బుల్డోజర్లు వస్తున్నాయని, పేదలన్నా ప్రేమ లేదు, ఆడబిడ్డలని ఇంగితం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసి పొట్టపోసుకుంటున్న ఆదివాసీల మీద దాడి చేస్తున్నారని సోమవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న ఆదివాసీల మీద దాడి అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. 420 హామీలను అమలు చేయలేక ఇవ్వని హామీలు హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూలుస్తున్నారని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణ, పరిశ్రమలకు భూసేకరణ పేరుతో లగచర్ల, దిలావర్‌పూర్, పెద్ద ధన్వాడ, చారగొండ, సిరసనగండ్లలో రైతుల పొలాల్లోకి, ఇండ్ల మీదకు బుల్డోజర్లు వచ్చాయన్నారు. పట్నం, పల్లెలు దాటి అడవుల మీద, ఆదివాసీల మీద కాంగ్రెస్ సర్కార్ కన్నుపడిందన్నారు.