బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
మంగపేట ఎస్త్స్ర టీ.వీ.ఆర్.సూరి
మంగపేట, మార్చి 31 ( విజయక్రాంతి ) : పెట్రోల్ బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మంగపేట ఎస్త్స్ర టీ.వీ.ఆర్.సూరి బంక్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులతో మంగళవారం మంగపేట పోలీస్ స్టేషన్ లో మంగపేట సెకండ్ ఎస్త్స్ర శ్రీకాంత్ తో కలిసి ఎస్త్స్ర టీ.వీ.ఆర్.సూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర టీ.వీ.ఆర్.సూరి మాట్లాడుతూ బంక్ నిర్వాహకులు వినియోగదారులకు నిబంధనల ప్రకారం సేవలు అందించాలన్నారు.
పెట్రోల్ బంక్ పరిసరాలు పూర్తిగా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మైనర్లకు బంకులలో పెట్రోల్ ఫిల్లింగ్ చేయకూడదని తెలిపారు. వాహనాలలో మాత్రమే పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ చేయాలని, బాటిల్స్, డ్రమ్ములలో, ట్యాంకర్లలో ఫిల్లింగ్ చేయకూడదని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెట్రోల్ బంకుల ముందు లారీ, ఇతర వాహనాలను పార్కింగ్ చేయకూడదని, పెట్రోల్ బంకుల ముందు వాహనాలు పార్కింగ్ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, వాహనాల నిలిపితే వాహనదారులతో పాటు బంక్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
పెట్రోల్ బంక్ నిర్వాహకులు వినియోగదారులకు త్రాగునీరు సౌకర్యం, ఎయిర్ సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మంగపేట ఎస్త్స్ర టీ.వీ.ఆర్.సూరి, మంగపేట సెకండ్ ఎస్త్స్ర శ్రీకాంత్, మండలంలోని బంక్ నిర్వాహకులు పాల్గొన్నారు.




