calender_icon.png 7 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవ పేరిట సింగరేణికి బురిడీ..?

07-10-2025 12:00:00 AM

  1. పక్కదారిలో సింగరేణి సేవలు 
  2. చెప్పిందొకటి.. చేసేదిమరొకటి..
  3. కోట్ల విలువైన సింగరేణి భూముల దుర్వినియోగం
  4. ప్రజాసేవ ముసుగులో జోరుగా వ్యాపారదందా

బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 6: సింగరేణి సేవలు దుర్వినియోగం అవుతోన్నాయి. ప్రజా సేవ పేరిట సింగరేణి సంస్థ నుంచి అప్పనంగా పొందిన కోట్ల విలువైన భూములు వ్యాపారులకు వరప్రదాయoగా మారా యి. సేవా ముసుగులో బెల్లంపల్లిలో పుట్టగొడుగుల్లా పలు రకాల వ్యాపార, వాణిజ్య సముదాయాలు వెలిశాయి. సింగరేణి నుంచి తీసుకోన్న స్థలాల్లో వెలిసిన కమ్యూనిటీ హాళ్లు, టిఫిన్ సెంటర్, ఆస్పత్రులు, వ్యాపార సముదాయాల వ్యాపారం మూడు పువ్వు.., ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి.

ఆయా కాలంలో పనిచేసిన సింగరేణి అధికారులు,ప్రజాప్రతినిధుల అండదండలు లేకుండా అవి జరగలేదన్నది జగమెరిగిన సత్యం. బెల్లంపల్లి నడిబొడ్డున మూతబడిన సౌత్ క్రాస్ కట్ గని, దాని పక్కనే వెలిసిన సముదాయాలు కోట్లు విలువైన సింగరేణి ఆస్తులు ఇదే స్పష్టం చేస్తున్నది. అంతేకాదు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఓ వైన్ షాప్ స్థానoలో ఉన్న సింగరేణి క్వార్టర్ ను ఓ వ్యాపారి కూల్చివేసి నిర్మించిన వ్యాపార సముదాయమే అది. 

ఇదిలా ఉండగా పదేళ్ళ క్రితం బెల్లంపల్లి బజార్ కేంద్రంగా ఉన్న సింగరేణి షాపింగ్ (దుకాణాల)ను అధికారులు వేలం వేసి ఇచ్చే వారు. వాటితో సింగరేణికి భారీ ఆదాయం వచ్చేది. ఈ ప్రక్రియను కాలం పట్టించి అప్పటి జీఎం నాగయ్య సింగరేణి దుకాణాల ను అందులో ఉన్న వ్యాపారులకు ఉచితంగానే అప్పగించారు. అప్పటి నుంచి వాటి నిర్వహణ సింగరేణి నుంచి జారిపోయింది. వేలం వెయ్యడం నిలిచిపోవడంతో సింగరేణి సంస్థ తన ఆదాయాన్ని కోల్పోయింది.

ఆ దుకాణాలను వ్యాపారులు కొందరు కూల్చివేసి కొత్త భవనాలను కట్టారు. మరికొందరు లీజుకి ఇచ్చి ఆదాయం పొందుతున్నారు. మొత్తంగా ఎంతో విలువైన సింగరేణి వ్యాపా ర సముదాయాన్ని గుండు గుత్తగా వ్యాపారు ల నుంచి కంపెనీకి నయా పైసా లబ్ది లేకుం డా కట్టబెట్టారు. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్టు కోట్ల విలువైన సింగరేణి వ్యాపార సముదాయాన్నీ వ్యాపారులకు దారాదత్తం చేశారు. 

ఇంత పెద్దఎత్తునా సింగరేణిలో అధికారులు ఉద్యోగ దుర్వినియో గానికి ఇంతకంటే సాక్షి భూతం మరొకటి లేదు. ఇదోరకమైన భారీ భూకుంభకోణమే. సింగరేణి భూ ఆక్రమణలలో మచ్చుకు కొన్ని మాత్రమే ఇవి. ఇలాంటివీ బెల్లంపల్లిలో అనుమతితో, అక్రమంగా వెలసిన వ్యాపార, వాణిజ్య సముదా యాలు కోకొళ్లలుగా ఉన్నాయి.

మూత పడిన సౌత్ క్రాస్ కట్ గని భూములను వశపరచుకోవడానికి ఇటీవలే బెల్లంపల్లిలో అనైతికతం గా ఒడికట్టిన భూకబ్జాదారుల తీరు వివిధత మే. ఈ దందా అంతా ఆధ్యాత్మిక, సేవాముసుగులో సింగరేణికి టోకరా వేయడమే నిరంతర ప్రక్రియగా కొనసాగుతోన్న సరికొత్త దగాకు పరాకాష్ట అని పలువురు భావిస్తున్నా రు. మూసివేసిన సౌత్ క్రాస్‌కట్ గని భూము ల కబ్జా ముసుగు తొలగిన వైనం బెల్లంపల్లిలో కబ్జాలతీరు గుట్టును రట్టు చేసింది.

సింగరేణికీ శఠగోపం..

దశాబ్దాలుగా ధనబలం, పలుకుబడి వెరసి సేవా, వినోదం, ఆధ్యాత్మికత సెంటిమెంటును ఎరగవేసి భూములు కబ్జా చేయడం సింగరేణిలో చాలా తేలికైపోయిoది. ఇలా బెల్లంపల్లిలో ఖాళీగా ఉన్న సింగరేణి భూసంపద చేయి దాటిపోయింది. వ్యాపార, వాణి జ్య సముదాయాపరుల పాపంలో తీలాపా పం తలా ఇంత అన్నట్లుగా అటు సింగరేణి, ఇటు రాజకీయ పెద్దలకు భాగం ఉన్నది. వారి స్వార్ధ ప్రయోజన కోసమే సింగరేణి భూముల ను చెరబట్టారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నా యి. ఇందులో ఎవరి ప్రయోజనం వారికుం డే ఉన్నది.

అందుకే నాటి నుంచీ నేటి వరకు భూకబ్జాలు వారికి కల్పవృక్షంగా మారాయి. ఏదేమైనా సింగరే ణి విలువైన భూములు మాత్రం క్రమక్రమేణా ఖాళీ అవుతూనే ఉన్నా యి. రకరకాల పేరిటా ఎంతో విలువైన సింగరేణి భూములను తెగనమ్ముతున్నారు. ఇంత జరిగినా.. జరుగుతోన్నా.. సింగరేణి యాజమాన్యం ఇంకా చోద్యం చూస్తునే ఉండి పోతుంది. సింగరేణి ఆస్తులు, భూముల రక్షణ కోసం కఠినమైన విధానం ఊసేలేదు.

కబ్జాదారులపై చర్యలేవి?

సింగరేణి సంస్థ భూములు, ఆస్తులను కాజేసిన వారిపై మొదటి నుంచీ చర్యలు లేవు. ఈ ఉదాసీనతే అక్రమార్కులకు కొండం త బలమైంది. మహా అయితే కబ్జా భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతోనే అధికారులు సరిపెట్టుకుంటున్నారు. ఇదే ఇప్పటి వరకు కొనసాగుతోన్న తంతు. కాగా కంపెనీ ఇప్పటి వరకు కబ్జా చేసిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యల జోలికే వెళ్ళలేదు. దీంతో నిర్భయంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నా రు. కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇదే ఇక్కడ సింగరేణి భూములకు శాపమైంది.

సింగరేణి భూముల పరిరక్షణలో యజమాన్యం వైఫల్యం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ అభివృద్ధి, కార్మికులు, ప్రజల సంక్షేమానికి వినియోగించాల్సిన సింగరేణి భూములను వ్యాపారు లకు అప్పనంగా సేవ పేరిట అంటగడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిటీ సమూహాలు సేవ పేరుతో ఫంక్ష న్ హాళ్ళు, భవన సముదాయాలను నిర్మించి అద్దె వ్యాపారం చేస్తున్నారు. ఇలా సింగరేణి సేవలు దారిమళ్ళాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అధికారులకూ మానవసేవ సంక్షేమంగా కనిపించడం లేదా? అన్న ప్రశ్నలు స్థానికుల్లో పెల్లుబికుతున్నాయి. 

మోసగాళ్లకు ప్రజాసేవ ఓ టెక్నిక్

సింగరేణి భూములను వశపరచుకోవడానికి వ్యాపారులు, మోసగాళ్లకు  ప్రజాసేవ ఓ టెక్నిక్‌గా మారిందన్న విమర్శలు ప్రబలుతున్నాయి. ఆ వంకతో సింగరేణి అధికారులను వ్యాపారులు, పలు సంస్థలు సులువుగానే బురిడీ కొట్టిస్తున్నాయన్న అభిప్రాయాలు వెల్లువె త్తుతున్నాయి. ఇందుకు మూతపడిన సౌత్ క్రాస్ కట్ గని భూముల్లో వెలిసిన సముదాయాల పనితీరే అందుకు తార్కాణం. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం తమ భూములను కాపా డుకోవడంలో ఎలాంటి శేషభిశలకు తావు ఇవ్వకుండా వ్యవహరిస్తేనే చేయ్యిదాటిన భూములూ చేతికోస్తాయి. ఉన్న భూములు దక్కుతాయి. ఈ విషయం లో యజమాన్యం కబ్జాకారులపై ఇప్పటికైనా కొరడా ఝులిపిస్తుందో.? ఏమి చేస్తదో చూడాలిమరి.