07-10-2025 12:00:00 AM
-స్వలంగా దెబ్బతిన్న కారు
-ఉండవల్లి వద్ద ఘటన
అలంపూర్, అక్టోబర్ 6: సినీ నటుడు విజయ్ దేవరకొండకు పెను ప్రమాదం తప్పింది. తాను ప్రయాణిస్తున్న కారును మినీవ్యాన్ ఢీకొనడంతో కారు దెబ్బతిన్నది. విజయ్ సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన గద్వాల జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారిపై సోమవారం జరిగింది. స్థానిక ఎస్సై శేఖర్ వివరాలు వెల్లడించారు. విజయ్, మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ అందే శ్రీకాంత్‌తో కలిసి తన లగ్జస్ మోడల్ కంపెనీకి చెందిన కారులో పుట్టపర్తికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్నారు.
గద్వాల జిల్లా ఉండవల్లి వరసిద్ధి వినాయక కాటన్ మిల్లు వద్ద కర్నూల్ వైపు వెళ్తున్న మినీ వ్యాన్ విజయ్ ప్రయాణిస్తున్న కారును ఎడమవైపు నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్‌తో పాటు మేనేజర్ రవికాంత్ యాదవ్, డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డారు. అనంతరం తన స్నేహితుడి కారులో విజయ్ హైదరాబాద్ వెళ్లిపోయారు. ప్రమాదంపై డ్రైవర్ అందె శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదానికి మినీ వ్యాన్‌ను డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణమని పేర్కొన్నారు.