ఆటోనగర్ ‘డంపింగ్’ సమస్యను పరిష్కరించాలి
మంత్రి కొండా సురేఖకు జక్కిడి శివచరణ్‌రెడ్డి వినతి
ఎల్బీనగర్, మార్చి 9: ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు గురవుతున్న ఆటో నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, దీంతో పాటు మన్సూరాబాద్ డివిజన్ లోని పాత పోచంపల్లి రోడ్డును పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి కోరారు. ఈ మేరకు దేవాదాయ ధర్మాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఆటో నగర్ లోని డీర్ పార్క్ అభివృద్ధి పనులను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రిని కలిసి మన్సూరాబాద్ చుట్టుపక్కల ప్రజలు డంపింగ్ యార్డ్‌తో నానా ఇబ్బందులు పడుచున్నారని, ఆటో నగర్ డంపింగ్ యార్డ్‌ను తొలిగించి సత్వరమే ప్రజలకు విము క్తి కలిగించాలని కోరారు. అలాగే మన్సూరాబాద్ నుంచి గౌరెల్లికి వెళ్లే పాత పోచంపల్లి జడ్పీ రోడ్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమములో యువజన కాంగ్రెస్ నాయకులు జనంపెల్లి విష్షువర్ధన్ రెడ్డి, దిండు ప్రవీణ్, యారాల రామ్ రెడ్డి, గుర్రం శ్యామ్ చరణ్ రెడ్డి, జక్కిడి సత్యతేజ్ రెడ్డి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




