24 May, 2026 | 12:42 PM

కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు

24-05-2026 11:41 AM

నల్గొండ: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసింది.  కోదాడ సమీపంలో జాతీయ రహదారిపై  ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొన్న ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న యోలో బస్సు(Yolo Bus) ముందు వెళ్తున్న ఓ లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. 

బస్సు లారీని ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు చెలరేగవచ్చని భయపడి ప్రయాణికులు బస్సును వదిలి ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను కోదాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తరలించారు.  బస్సు డ్రైవర్ వాహనం నడుపుతుండగా కునుకు తీయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణ తెలిసింది. ఈ ఘటన కారణంగా ఎన్హెచ్-65పై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.