calender_icon.png 10 November, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

10-11-2025 12:15:04 AM

  1. తాజా సీఎం, మాజీ సీఎంలకు కిషన్‌రెడ్డి సవాల్
  2. ప్రెస్‌క్లబ్ వేదికగా చర్చకు ఆహ్వానం

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం మంత్రి కేసీఆర్‌లకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. తెలంగాణ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కేంద్రం తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులను ప్ర జల ముందు ఉంచుతామన్నారు. ప్రెస్‌క్లబ్ వేదికగా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. తెలంగాణను తాము నిర్లక్ష్యం చేశామని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.

తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపై బహిరంగ చర్చ జరిగే విధంగా సహకరించాలని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ప్రెసిడెంట్‌కు లేఖ రాశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి సరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వివరించారు.

ఈ విషయంపై ప్రెస్‌క్లబ్ వేదికగా బహిరంగ రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నామని, అందుకు ప్రెస్‌క్లబ్ ప్రెసిడెంట్ సహకరించాలని రాసిన లేఖలో కోరారు. తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరిని ఆహ్వానించాలని, వాస్తవాలు ఏమిటో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు తెలిసే విధంగా మీడియా ముందు నిర్మాణాత్మకమైన చర్చకు చొరవ తీసుకోవాలని కోరారు. అయితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష ప్రెస్‌క్లబ్ నియమ నిబంధనలకు అనుగుణంగా, పద్ధతిగా, పార్లమెంటరీ పద్ధతిలో ఉండాలనే విషయం అర్థం చేసుకుని వ్యక్తిగత, అసహ్యపు మాటలు లేకుండా సానుకూల చర్చ జరిగేలా చూడాలని కిషన్‌రెడ్డి కోరారు.