calender_icon.png 27 July, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో పేలిన బస్సు టైరు

26-07-2025 10:54:26 PM

త్రుటీలో తప్పిన ప్రమాదం..

ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు.. 

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District)లో శనివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు టైరు పేలి త్రుటీలో పెను ప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి బస్సును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో 70 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు.

ఎల్లారెడ్డి కామారెడ్డి రహదారిలో హాజీపూర్ తండా సమీపంలో ఆర్టీసీ బస్సు ముందు టైరు పెద్ద శబ్దం చేస్తు పేలింది. ఆ సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఎదురుగా ఏమీ లేకపోవడంతో డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల  విద్యార్థులు సైతం బస్సులో ప్రయాణం చేస్తున్నారు. బస్సు డ్రైవర్ చూపిన సమయస్ఫూర్తి వల్ల ప్రమాదం నుంచి గట్టే కామని ప్రయాణికులు డ్రైవర్ కు కృతజ్ఞతలు తెలిపారు.