calender_icon.png 30 October, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలిచిన సంఘాల అసమర్ధతతో పరిష్కారం కాని కార్మిక సమస్యలు

29-10-2025 05:03:55 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణిలో గెలిచిన సంఘాల అసమర్ధత మూలంగా కార్మికుల సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారాన్ని నేర్చుకోవడం లేదని సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి ఆరోపించారు. ఏరియాలోని కేకే ఓసీపి లో  బుధవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన కార్మికులనుద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించినప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సంవత్సరం కిందట క్లరికల్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్కు పరీక్ష నిర్వహింప చేయడం,  ప్రతి నెల జరిగే మెడికల్ బోర్డు దుర్మార్గమన్నారు. రెండు సంవత్సరాల కాల పరిమితి ఉన్న కార్మికులను మెడికల్ కు అప్లై చేసుకోమని చెప్పి అప్లై చేసుకున్న కార్మికులకు వారి రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్న మెడికల్ బోర్డుకు పిలవకుండా ఉండి డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంటే గెలిచిన సంఘాలు సింగరేణి యాజమాన్యానికి వత్తాసు పలికుంటున్నారని విమర్శించారు.

డ్యూటీలు చేయని కార్మికులకు తూతూమంత్రంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారి సమస్యలకు సరైన కారణాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి కుండా  పని చేయలేదని అపవాదు మోపుతూ ఛార్జ్ షీట్లు ఇస్తూ  యాజమాన్యం 150 కన్నా తక్కువ మస్టర్లు ఉన్నవారిని డిస్మిస్ చేయడానికి సర్కులర్ ఇవ్వడం సరికాదనీ ఆయన యాజమాన్యం తీరుపై విరుచుకుపడ్డారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండు సం,,లు కాలపరిమితి ముగియడానికి వస్తున్న ఇప్పటివరకు గెలిచిన సంఘాల మేనిఫెస్టోలో ఉన్న మొదటి డిమాండ్లలో సొంతింటి కల పెర్క్స్ మీద ఐటి మాఫీ మారుపేర్ల వంటి సమస్యలను పరిష్కారానికి అతి గతి లేదని మళ్ళి జరిగే సింగరేణి ఎన్నికల్లో ఇవే హామీలు కార్మికులకు చెప్పేలా ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

గెలిచిన కార్మిక సంఘాల పట్ల కార్మికుల్లో నమ్మకం కోల్పోక ముందే ఇప్పటికైనా ఒంటరిగా కాకుండా అన్ని యూనియన్ లను కలుపుకొని యాజమాన్యంపై పోరాటానికి పిలుపునిచ్చే పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన హితవు పలికారు. కేకే ఓసిపి లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటికిరాయి,  మొదటి స్ట్రక్చర్ మీటింగ్లో మాట్లాడామనీ చెప్పిన నాయకులు రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటికి ఇంటికిరాయి ఇప్పించడంలో విఫలమయ్యా రని విమర్శించారు. త్వరలో సింగరేణిలో కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు గెలిచిన సంఘాలు, యాజమాన్యంపై ఒత్తిడి తేవడానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) పిలుపులో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి.రాజేందర్, ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, ఆర్గనైజర్ లింగాల రమేష్, ఓసిపి కార్మికులు పాల్గొన్నారు.