25 April, 2026 | 11:23 PM

గ్రేటర్‌లో 45 బస్‌పాస్ కేంద్రాలు

26-06-2024 01:58 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 25 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తం గా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మొత్తం 45 బస్ పాస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ కేంద్రాల్లో జనరల్ పాస్‌లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు, డయాలిసిస్ బాధితులకు పాస్‌లు అందిస్తామన్నారు. ఉదయం రూ. 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు కేంద్రాలు పనిచేస్తాయన్నారు.

స్వర్ణగిరి టెంపుల్‌కు ప్రత్యేక బస్సులు... 

భువనగిరి వద్దనున్న స్వర్ణగిరి టెంపుల్‌కు కంటోన్మెంట్ డిపో నుంచి బుధవారం నుంచి రెండు ప్రత్యేకమైన ఈ ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ బస్సులను నుంచి (26 జూన్) నడుతుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.  బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

నేటి నుంచి బస్‌పాస్‌లు రెన్యూవల్ 

రాష్ట్రంలోని అక్రిడిటేషన్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసులను బుధవారం నుంచి రెన్యూవల్ చేయనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ ఈడి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు కారణంగా దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించలేకపోయమన్నారు. బస్ పాస్ కేంద్రాలకు జర్నలిస్టులు పాస్‌లు పొందాలన్నారు.