calender_icon.png 13 September, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూతురిని హ‌త‌మార్చిన క‌సాయి త‌ల్లి అరెస్టు

13-09-2025 07:25:31 PM

పోలీసుల అదుపులో నిందితులు 

డీఎస్పీ న‌రేంద‌ర్‌గౌడ్‌

తూప్రాన్: చిన్నారిని హతమార్చి కాలువలో పూడ్చిపెట్టిన కేసును పోలీసులు చేధించారు. తూప్రాన్ డీఎస్పీ న‌రేంద‌ర్‌గౌడ్ మీడియా స‌మావేశంలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. మెదక్ జిల్లా శివంపేట్ మండలం శభాష్ పల్లికి చెందిన మమతను సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన భాస్కర్ కు ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు చరణ్, మూడేళ్ల కూతురు తనుశ్రీలు సంతానంగా ఉన్నారు. అత్తగారింటి వద్ద తగాదాలతో మమత పుట్టింటికి వెళ్ళింది, ఇదే క్రమంలో అదే గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ తో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కనపర్రులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు.

ఇదిలా ఉండగా మమత తల్లిదండ్రులు మే 27న పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు కానపర్రులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించారు. వారి వివాహేతర సంబంధానికి కూతురు త‌నుశ్రీ అడ్డుగా ఉందని  జూన్ 4న రాత్రి సమయంలో వాహనంపై శభాష్ పల్లి గ్రామ శివారులోకి తీసుకువచ్చి గొంతు నులిమి చంపి కొత్తకుంట సమీపంలో ఎవరు లేని సమయంలో పాతిపెట్టినట్లు విచారణలో తెలిపారని డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. ఈ కేసును చేదించిన సీఐ రంగాకృష్ణ, శివంపేట్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, సిబ్బంది విష్ణువర్ధన్ రెడ్డి, మహేందర్, గట్టేష్ లను డీఎస్పీ అభినందించారు.