13-09-2025 09:16:41 PM
జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి రవీందర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల/ వేములవాడ: వేములవాడ పరిధిలోని తిప్పాపూర్ గోశాలలో రేపు ఆదివారం కోడెల పంపిణీ కార్యక్రమాన్ని అనివార్య కారణాల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి రవీందర్ రెడ్డి(District Animal Husbandry Officer Ravinder Reddy) శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజన్న కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులందరూ గమనించాలని సూచించారు. కోడెల పంపిణీ మళ్లీ తదుపరి తేదీ ఎప్పుడు పంపిణీ చేస్తామనే విషయం ప్రకటిస్తామని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు.