calender_icon.png 13 September, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి

13-09-2025 09:08:23 PM

జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య(District Additional Collector Chandraiah) ఆదేశించారు. శనివారం సాయంత్రం తహసిల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాలకు జెపిఓలను ప్రభుత్వం నియమించిందని వారితో సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. సాదా బైనమా దరఖాస్తు చేస్తున్నవారు పారాన్ని డౌన్లోడ్ చేసి పరిశీలించి పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దిలీప్ కుమార్, రెవెన్యూ డిటి శ్రావణి, సీనియర్ అసిస్టెంట్ నవనీత్ పాల్గొన్నారు.