calender_icon.png 13 September, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలుకల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

13-09-2025 07:25:33 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): స్కూలుకు వెళ్లి చదువుకోమని తల్లిదండ్రులు మందలించడంతో ఎలుకల మందు తాగి విద్యార్థిని మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎగ్గేవార్ రామాజీ, లక్ష్మి దంపతుల రెండవ కూతురు ఎగ్గేవారు సుప్రియ(14) శనివారం తెల్లవారుజామున ఎలుకల మందు సేవించి వాంతులు చేసుకుంది. అస్వస్థతకు గురైన సుప్రియను తల్లిదండ్రులు హుటాహుటిగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బెల్లంపల్లి వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ సుప్రియ మృతి చెందింది. కాగా మృతురాలు సుప్రియ ఆకెనపల్లి హైస్కూల్లో 9వ తరగతి చదువుతుంది. అనారోగ్యంతో మూడు రోజులుగా స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. స్కూలుకు వెళ్లాలని తల్లిదండ్రులు మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మృతురాలు సుప్రియ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాళ్ల గురజాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.