calender_icon.png 13 September, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

13-09-2025 08:51:59 PM

మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన

సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్

గరిడేపల్లి,(విజయక్రాంతి): డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ పొగాకు మత్తు పదార్థాలపై విచిత్ర వేషధారణలో ప్రచారం నిర్వహించారు.గంజాయి, మత్తు పదార్థాల వినియోగానికి విద్యార్థులు దూరంగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అలవాటు పడకూడదన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.నో డ్రగ్స్ లైఫ్ అంటూ కరపత్రాలు పంచుతూ ఫ్లెక్సీతో విచిత్ర వేషధారణలో ప్రచారం నిర్వహించారు.