calender_icon.png 13 September, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవితాన్ని పోరాడి గెలవండి

13-09-2025 09:28:04 PM

జీతాలు లేవని ప్రాణాలు కోల్పోతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వినతి..

మానవ హక్కుల సంఘం ఖానాపూర్ అధ్యక్షుడు షేక్ షకీల్

ఖానాపూర్ (విజయక్రాంతి): అరకొరా జీతాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేవని ప్రాణాలు కోల్పోవడం, కుటుంబాలను అనాధలుగా చేయడం సరికాదని, జీవితాన్ని పోరాడి గెలవాలని మానవాక్కుల సంఘం ఖానాపూర్ అధ్యక్షులు షేక్ షకీల్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా ఎంపీడీవో కార్యాలయంలో ఈ పంచాయతీ ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఏలేటి సోమిరెడ్డి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం ఆర్థిక ఇబ్బందులతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో స్పందించారు.

తాము కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నప్పటికీ గత ఆరు నెలలుగా ఎటువంటి జీతాలు లేకున్నా కుటుంబాలు నెట్టుకు వస్తున్నామని అయితే ఈ పరిస్థితుల్లో కుటుంబాలను విడిచిపెట్టి ప్రాణాలు తీసుకోవడం వంటి నిర్ణయాలకు తావు ఇవ్వకూడదని సాధ్యమైనంత పోరాడి, అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో దానిపై యుద్ధాలు చేయాలని అందుకోసం రాష్ట్ర కార్యవర్గం తగు నిర్ణయం తీసుకొని, ప్రభుత్వాలను నిలదీసేందుకు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరిగిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఎన్నికల సమయంలో తమను వాడుకొని విడిచిపెట్టడం దారుణమని, కాంట్రాక్టర్లు ప్రభుత్వాలు తమను తమ కుటుంబాలను ఆదుకోవాలని, ప్రతినెలా సరిగ్గా జీతాలు ఇస్తే ఎలాగోలా తాము బ్రతుకులు ఈడుస్తామని ఆయన అన్నారు.