calender_icon.png 13 September, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర పనులను వెంటనే చేపట్టాలి

13-09-2025 08:54:43 PM

స్మశాన వాటికకు వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేయండి

జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు గండ్లు పడిన వాటికి మరమ్మత్తు పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శనివారం   కామారెడ్డి పట్టణంలో పర్యటించి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న హౌసింగ్ బోర్డ్ వైకుంఠధామం యందు అత్యవసరంగా ఏర్పాటు చేయబడుతున్న రోడ్డు పనులను, వాటర్ సప్లై, ఫిల్టర్ బెడ్ ను సందర్శించారు. ఆయనతోపాటు ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారుల కు వెంటనే అత్యవసరంగా పునరుద్ధరణ పనులను చేపట్టవలసిందిగా ఆదేశించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించవలసిందిగా సూచించారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వీణ, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ శంకర్, వేణు ప్రసాద్, కామారెడ్డి డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.