19-05-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ మే 18 (విజయక్రాంతి)ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అ కాల వర్షాల నుండి కాపాడుకుంటూ అమ్ముకునే క్రమంలో రైతన్నలు ఆపసోపాలకు గు రవుతున్నాడు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం త డుస్తూ పండించిన పంటకు పెట్టిన పెట్టుబడి కూడా అందుతుందో లేదో అన్న భయంతో రైతులు తల్లడిల్లుతున్నారు.
ఇదే అదునుగా భావించిన రైస్ మిల్లర్లు అడ్డగోలుగా దోచుకోవడానికి కొత్త పంతాను ఎంచుకున్నారు. ఇప్పటికే అధికారులతో కుమ్మక్కై అధిక శాతాన్ని ధాన్యం కేటాయించుకుంటున్న కొన్ని రైస్ మిల్లర్లు నేరుగా వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతోనే మిలాకత్ అయ్యి నేరుగా ధాన్యాన్ని మిల్లుకే పంపేలా తెర వెనుక కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధా న్యాన్ని తేమ, తాలును పరీక్షించి తూకం వేసి ధాన్యం బస్తాల్లో నింపి టెండర్ ప్రక్రియ ద్వా రా ఏర్పాటు చేసిన లారీల్లోనే ప్రభుత్వం కేటాయించిన మిల్లులకు దాన్యం పంపాల్సి ఉంది. కానీ కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తక్ పట్టీలు కూడా లేకుండా గన్ని బ్యాగులు చేతికిచ్చి తూకం వేసుకోమని చెప్పి బుక్క చిట్టీలు మాదిరి పేపర్ పై బ్యాగుల సంఖ్యను వేసి నేరుగా ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు పంపుతున్నారు.
తీరా మిల్లు యజమానులు రుబాబుగా ధాన్యాన్ని పరీక్షించి తేమ తరుగు ఎక్కువ శాతం కోతలు విధిస్తూ అదనంగా ఒక్కో బ్యాగు నుంచి మూడున్నర కిలోలు తరుగు తీస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద ట్రాక్టర్ లోడ్ ఎత్తే హమాలికి సైతం ఒక్కో సంచకి రూ 23 చొప్పున హమాలి చార్జీలు, ధాన్యం రవాణా కోసం ఒక్కో ట్రాక్టర్ ఖర్చు రోజుకు మూడు వేల చొప్పున రైతులే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
చివరికి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సరఫరా చేసినట్లుగా బిల్లులు కూడా నమోదు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చివరికి రైతులు పండించిన ధాన్యానికి అమ్ముకోవడం కోసం కూడాఅప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతే రాజు దేశానికి అన్నం పెట్టేది రైతన్న అంటూ వేదికలపై ప్రగల్భాలు పలికే పాలకులు సైతం రైతులకు నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని రైతన్నలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇదం తా తెలిసిన సంబంధిత శాఖ అధికారులు సైతం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆయా కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన క్రమంలో ఎన్నో తప్పు లను గుర్తించినప్పటికీ సంబంధిత కారకులపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అల సత్వం మరింత పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. అధికారులు మిల్లర్లు కుమ్మక్కయ్యారు కాబట్టే ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవ డం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
రైతు ల పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే అధికారుల కనుసనల్లోనే నేరుగా కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో మిల్లర్లు మీలాకత్ అయ్యారన్న ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా రైతులు కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల వద్ద ఎండకు వానకు ఇబ్బందులు పడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు.
సన్న రకం వడ్లకు 500 బోనస్ కూడా అదనంగా ప్రకటిస్తూ రైతులు సాగు వైపు మొగ్గు చూపాలని కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగులకు అధికారులు రైస్ మిల్లర్లు చక్రబంధనం విధిస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
నేరుగా మిల్లులకే పొమ్మన్నారు
నాకున్న రెండెకరాల 10 గుంటల భూమిలో దొడ్డోడ్లు సాగు చేశా. 112 బస్తాలు వరి దిగుబడి వచ్చింది. దానిని ఎండబెట్ల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం నిర్వాహకుల దగ్గరికి వెళ్తే ధాన్యం బస్తాల్లోకి నింపుకోమని ఖాళీ సంచులు చేతికిచ్చారు. లారీలు వస్తలేవు కాబట్టి మీరే మిల్లులకు తీసుకెళ్లాలన్నారు. అక్కడే ఉన్న హమాలీలతో ఒక్కో బ్యాగు 23 రూపాయలు చొప్పున ట్రాక్టర్లోకి ఎక్కించి మిల్లు వద్దకు ధాన్యాన్ని తీసుకు వచ్చాం.
రోజుకు మూడు వేల చొప్పున ట్రాక్టర్ కిరాయి కూడా భరిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక్కో సంచిని పరీక్షించి ఒక్కో బ్యాగు నుంచి మూడున్నర కిలోలు అదనంగా తరుగు తీస్తామని చెప్పారు. ఇదేంటని అడిగితే ఇష్టం ఉంటే దింపు లేదంటే తీసుకెళ్ళు అంటూ మిల్లర్లు బెదిరిస్తున్నారు.
చటమోని వెంకటయ్య, రైతు, ఎండబెట్ల.
లారీల కొరత లేదు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధా న్యాన్ని క్రమం తప్పకుండా తేమ పరీక్షించి ధాన్యం బస్తాలకు నింపుతున్నారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన లారీల్లోనే ధాన్యాన్ని తక్ పట్టీల ద్వారా కేటాయించిన మిల్లులకు సరఫరా సాఫీ గా జరుగుతుంది.
కానీ కొంతమంది రైతులు తమకు అనుకూలంగా ఉండే మిల్లర్ల వద్దకు ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తీసుకు వెళ్తున్నట్లు తెలిసింది. నేరుగా మిల్లులకు ధాన్యాన్ని తరలించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.
అమరేందర్, అదనపు కలెక్టర్ నాగర్ కర్నూల్.