13-09-2025 10:56:12 PM
కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఫైర్
అలంపూర్: గద్వాలకు ఏ మొహం పెట్టుకుని వస్తావ్ అంటూ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ఫైరయ్యారు. బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో తలపెట్టిన గద్వాల గర్జన సభకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.అధికార పార్టీకి చెందిన పలువురు కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ... పదేళ్ల బిఆర్ఎస్ పాలలో చేనేత శాఖ మంత్రిగా ఉన్న ఆయన గద్వాలలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పి చేనేత కార్మికులను మోసం చేశాడని ధ్వజమెత్తారు.
శంకుస్థాపన చేసిన శిలాఫలకం చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయని కేటీఆర్ వెళ్లి చూడాలని డిమాండ్ చేశారు. తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి సగం సగం పనులు చేసి పోయారని ఆరోపించారు. సరైన సౌకర్యాలు కల్పించకుండానే వంద పడకల ఆసుపత్రికి రిబ్బన్ కటింగ్ చేసి పోయారని మండిపడ్డారు. పదేళ్లలో గద్వాల జిల్లా పరిధిలోని నాలుగు మునిసిపాలిటీలకు ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వలేదన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో వంద పడకల ఆసుపత్రిని అన్ని సౌకర్యాలతో తిరిగి ప్రారంభించుకుందాం అని గుర్తు చేశారు.
తమ సర్కారు హాయంలో మల్లమ్మకుంట సర్వే పనులు ప్రారంభమైమయ్యాయని అన్నారు. రూ.120 కోట్లతో జూరాలపై కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నామని తెలిపారు.పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆడ ,మగ అంటూ కామెంట్ చేస్తున్నారని వారికి టికెట్ ఇచ్చినాడు కేటీఆర్ కు ఏ లింగమో తెలియదా అని ప్రశ్నించారు.తాను కాంగ్రెస్ విప్ గా ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ఐదుగురిని టిడిపి ఎమ్మెల్యేలను 15 మందిని టిఆర్ఎస్ లో చేర్చుకున్నారని మండిపడ్డారు.బిఆర్ఎస్ వాళ్ళు చేస్తే సంసారం... తాము చేస్తే వ్యభిచారమా అని దుయ్యబట్టారు.