calender_icon.png 14 September, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 టన్నుల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

13-09-2025 10:48:03 PM

ఇబ్రహీంపట్నం: అక్రమంగా నిల్వ ఉంచిన 10 టన్నుల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల మున్సిపాలిటీ, మంగల్ పల్లి గ్రామంలో పీడీఎస్‌ బియ్యం నిల్వచేసినట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో వెంటనే అక్కడకు చేరుకొని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని, పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై వారికి అప్పగించామనీ తెలిపారు. ఎవరైనా అక్రమంగా రేషన్‌ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా బియ్యం తరలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.