calender_icon.png 14 September, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం

13-09-2025 10:24:17 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద 

సూర్యాపేట,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన లోక్ అదాలత్ కు హాజరైన ప్రజలకు లయన్స్ ఇంటర్నేషనల్ 320ఈ రీజియన్ 5 ఆధ్వర్యంలో గుడిపూడి వెంకటేశ్వరరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన అల్పాహార వితరణ కార్యక్రమాన్ని  ప్రారంభించి మాట్లాడారు.ప్రతి ఒక్కరు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని  తెలిపారు.లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా గత 23 రోజులుగా అల్పాహార పంపిణీ కార్యక్రమంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.