19-05-2025 12:05:41 AM
మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ మే 18 (విజయ క్రాంతి) : దైవభక్తి ప్రతి ఒక్కరిలో ఉండాలని మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివా రం జడ్చర్ల పట్టణం కావేరమ్మపేట బంగారు మైసమ్మ తల్లి దేవత శిఖర కలశ ప్రతిష్టాపన మహోత్సవం లో పాల్గొని మాజీమంత్రి సీ లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
గడిచిన పదేళ్లపాటు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలయాలకు ప్రత్యేకత ఇస్తూ రావడం జరిగిందని తెలిపారు. దైవభక్తి ప్రతి ఒక్కరినీ సన్మార్గం లో నడిపిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.