calender_icon.png 27 December, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలపు వల విసిరి సైబర్ మోసం

08-10-2024 02:31:20 AM

రూ.7.27 లక్షలు స్వాహా

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): వలపు వల విసిరి ఓ వ్యక్తి నుంచి రూ. 7.27 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి 90598639 87 నంబర్ నుంచి కాల్ వచ్చింది. మహిళ గొంతుతో తియ్యటి మాటలతో వలపు వల విసిరిన సైబర్ నేరగాళ్లు నెమ్మదిగా బాధితుడిని తమ ముగ్గులోకి దింపారు.

అనంతరం వాట్సప్ చాటింగ్ ద్వారా మరింత దగ్గరయ్యారు. ప్లాన్ ప్రకారం బాధితుడిని m.catalystmarketsfx.com అనే వెబ్‌సైట్‌లో ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టేలా ఒప్పించారు. అలా పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లు చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకోవడానికి కొంత మొత్తం చెల్లించాలని సూచించారు.

దీంతో పలు దఫాలుగా బాధితుడు మొత్తం రూ. 7.27 లక్షలు చెల్లించాడు. తర్వాత అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు.