ఢిల్లీ విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
బోధన్, జూలై 23 (విజయ క్రాంతి): ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై జరిగినట్లు పేర్కొంటున్న లాఠీచార్జిని ఖండిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు పిడిఎస్, ఎస్ బి , ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎఫ్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తూ ఢిల్లీలో పార్లమెంట్ ఎదుట శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేసి, పలువురిని గాయపరిచి అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నీట్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసాయం అందించాలని, లాఠీచార్జికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొంటూ, నేడు నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త ఇంటర్, డిగ్రీ మరియు ఇతర ఉన్నత విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఎఐఎస్బి జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఎఐఎప్ డి ఎస్ నాయకులు మోసిన్, సామెల్, బలరాం, నాందేవ్, ప్రకాష్, వాజిద్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.






