22-01-2026 05:27:49 PM
ఖానాపూర్ (విజయక్రాంతి):నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో శుక్రవారం బంద్, నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సాధన జేఏసీ కమిటీ పిలుపునిచ్చింది .గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం ఖానాపూర్ పట్టణంలో మంజూరు చేసిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం ఖానాపూర్ లో చేపట్టకుండా ఎమ్మెల్యే ఊట్నూరుకు తరలించకపోతున్నాడని ఆరోపిస్తూ ఖానాపూర్ ప్రాంత నాలుగు మండలాలు ఖానాపూర్ ,కడం, దస్తురాబాద్, పెంబి, మండలాల ప్రజలు జేఏసీ కమిటీగా ఏర్పడిన నేపథ్యంలో స్థానిక విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాల నిర్మాణం ఖానాపూర్ పట్టణంలోనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ కమిటీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలో ర్యాలీ కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సముదాయాలు బందుకు సహకరించాలని వారుకోరారు.