calender_icon.png 22 January, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష

22-01-2026 05:26:01 PM

  రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు 

గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒక వ్యక్తికి  గోదావరిఖని మెజిస్ట్రేట్ 03 రోజుల జైలు శిక్ష విధించినట్లు రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.   సీఐ ఆధ్వర్యంలో గోదావరిఖని లో డ్రంక్&డ్రైవ్ నిర్వహించగా  దొరికిన 5 మందిని, సెకండ్ అడిషనల్ గోదావరిఖని  మేజిస్ట్రేట్ వెంకటేష్ దుర్వ  ముందు హాజరుపరుచగా 4 గురికి  రూ. 8,000/- రూపాయల జరిమానా విధించారని, ఒక వ్యక్తి కి రెండవసారి పట్టుబడగా 03 రోజుల జైలు శిక్ష విధించారని సీఐ తెలిపారు. వీరిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించామన్నారు.